చత్తీస్ గఢ్ రాష్ట్రంలో పోలీస్ భద్రతా భద్రతా బలగాలను మావోయిస్టులు టార్గెట్ చేశారు. చాట్రాయి కొండపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీ బాంబ్స్ పాతిపెట్టారు. కోబ్రా స్పెషల్ పోలీస్ సిబ్బంది పేలుడు పదార్థాలను గుర్తించి నిర్వీర్యం చేశారు. 3 కిలోల చొప్పున రెండు ప్రెజర్ ఐఈడీలను కోబ్రా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.