HYDలోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో FDC చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి మొత్తం 46 మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ భేటీకి నటుడు చిరంజీవి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దిల్ రాజు స్వయంగా చిరంజీవిని ఆహ్వానించారని తెలుస్తోంది. కానీ తాను చెన్నైలో షూటింగ్‌లో ఉండడంతో రాలేనని చెప్పారట. అందువల్లే సమావేశానికి చిరంజీవి రాలేకపోయారని తెలుస్తోంది.