‘అమ్మ’ పాట పాడి ఆకట్టుకున్న చిట్టితల్లి (video)

84చూసినవారు
తెలంగాణ కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్ రాసిన ‘అమ్మ పాడే జోల పాట’ అందరినీ అలరించింది. సింగర్ జాహ్నవి అద్భుతంగా ఆలపించిన పాటను ఓ బాలిక అచ్చుగుద్దినట్టుగా పాడటంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కరీంనగర్ లోని పారమిత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 'ఆద్య' స్కూలు ప్రారంభం కావడంతో మొదటి రోజున తన క్లాసులో ఈ పాట పాడింది. క్లాస్ టీచర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాప పాడిన తీరుకి ప్రశంసలు కురుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్