హైదరాబాద్ లో చుడీదార్ GANG కలకలం(వీడియో)

65చూసినవారు
హైదరాబాద్ లో కొందరు దుండగులు కొత్తరకం దొంగతనాలకు తెరతీశారు. చెడ్డీ గ్యాంగ్ మాదిరి చుడీదార్ వేసుకుని వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. SR నగర్ ఠాణా పరిధి జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్ లో వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు మహిళలలాగా చుడీదార్ వేసుకుని వచ్చి, ముసుగులు ధరించి ఇంట్లోని 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ ఎత్తుకెళ్లారు. దీనిపై కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్