ఢిల్లీలోని రావూస్ స్టడీ సర్కిల్ బేస్‌మెంట్‌లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రమాదానికి ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో వరద నీరు బేస్‌మెంట్‌లోకి ప్రవేశించటంతో లోపల ఉన్న విద్యార్థులు బయటకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే మృతి చెందిన విద్యార్థులు బయటకు వచ్చేలోపే వరద చుట్టిముట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.