భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ శుక్రవారం అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ఆయన పూజలు చేశారు. ఆయనకు జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. చంద్రచూడ్ దాదాపు రెండున్నర గంటల పాటు అయోధ్యలో ఉన్నారని అధికారులు తెలిపారు. సాయంత్రం 5:30 గంటలకు రామ్‌కథా పార్క్ హెలిప్యాడ్ నుండి హెలికాప్టర్‌లో లక్నోకు బయలుదేరినట్లు వెల్లడించారు.