రేవ్ పార్టీపై యాంకర్ శ్యామల క్లారిటీ

61చూసినవారు
బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీలో తెలుగు నటీనటులు కొందరు ఉన్నారు అంటూ ప్రచారం జరిగిన సంఘటన తెలిసిందే. ముఖ్యంగా హేమ ముందు నుంచి హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. అయితే ఈ పార్టీలో నటి యాంకర్ శ్యామల కూడా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల క్లారిటీ ఇచ్చారు. తాను ఆ పార్టీలో లేనని తెలిపారు. అనవసరంగా తన పేరు లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్