వారణాసి తప్ప మిగతావన్నీ బీజేపీకి ఓటమి తప్పదు: అఖిలేష్

59చూసినవారు
వారణాసి తప్ప మిగతావన్నీ బీజేపీకి ఓటమి తప్పదు: అఖిలేష్
ఉత్తరప్రదేశ్‌లో విపక్షాల ఐక్య వేదిక 'ఇండియా' ఫోరం గాలి వీస్తోందని సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం మినహా యూపీలోని అన్ని స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని అన్నారు. 'ఇండియా' ఫోరం అభ్యర్థులకు మద్దతుగా మంగళవారం లాల్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. యూపీ ప్రజలు ఈసారి ఎలాంటి వ్యూహాలు పన్నినా బీజేపీని తుడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నారని అఖిలేష్ అన్నారు.

సంబంధిత పోస్ట్