మోదీ బయోపిక్‌లో నటించడం లేదు: సత్యరాజ్

50చూసినవారు
మోదీ బయోపిక్‌లో నటించడం లేదు: సత్యరాజ్
ప్రధాని మోదీ బయోపిక్‌లో బాహుబలి నటుడు సత్యరాజ్ నటిస్తున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన తాజాగా స్పందించారు. ‘‘నేను మోదీ బయోపిక్‌లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ చిత్రం కోసం ఇప్పటివరకు నన్నెవరూ సంప్రదించలేదు. ఒకవేళ ఈ బయోపిక్‌ కోసం ఎవరైనా సంప్రదించినా నేను అంగీకరించను. ఎందుకంటే ఇది నా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండే అవకాశముంది’’ అని స్పష్టతనిచ్చారు.

సంబంధిత పోస్ట్