ఏపీలో తక్షణమే రోడ్ల మరమ్మతులకు సంబంధించిన పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు ఉన్నాయని, తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. మొత్తంగా రాష్ట్రంలో 7,087 మేర రోడ్లు వేయడానికి రూ.300 కోట్ల నిధులు అవసరం అని తెలిపారు. గుంతలు పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.