తెలంగాణలో ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూ కట్టేవారని.. ప్రస్తుతం ఇంటి బాట పట్టేందుకు క్యూ కడుతున్నారని BRS నేత హరీశ్‌రావు విమర్శించారు. 'CM రేవంత్ వద్దే విద్యాశాఖ ఉంది. విద్యార్థుల భవిష్యత్తును CM ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే.. బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతోంది. దిలావర్‌పూర్ KGBV విద్యార్థులు ‘ఈ బువ్వ మేం తినలేం, మమ్మల్ని తీసుకెళ్లండి’ అని తల్లిదండ్రులను వేడుకుంటున్నారు' అని ట్వీట్ చేశారు.