2024 ఫిబ్రవరిలో విడుదలైన 'మంజుమ్మల్ బాయ్స్' రూ.240 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమాగా రికార్డుకెక్కింది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడు జీవితం', టొవినో థామస్ యాక్ట్ చేసిన 'ఎ.ఆర్.ఎం', నస్లేన్ కె. గఫూర్, మమతా బైజు జంటగా నటించిన 'ప్రేమలు' రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి.