సీఎం స్థాయికి తగినట్లు రేవంత్ ప్రవర్తించడం లేదని BRS నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రుణమాఫీ హామీపై సీఎం మాట తప్పారని అన్నారు. డిసెంబరు 9 నాటికి రూ. 40 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తానని రేవంత్ అన్నారు.. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారని విమర్శించారు.