కర్ణాటకలోని బెల్గామ్‌లో నిర్వహించిన CWC సమావేశంలో సీఎం రేవంత్ ప్రసంగించారు. దేశంలో త్వరలో పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని సీఎం చెప్పారు. జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలలో సీట్ల పెంపు తక్కువగా ఉండి నష్టపోయే పరిస్థితి ఉంటుందన్నారు. అందువల్ల ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించాలని సూచించారు. జనగణనలో కులగణన చేపట్టాలని సీఎం ప్రతిపాదించగా CWC ఆమోదం తెలిపింది.