తెలంగాణలో CM రేవంత్ అబద్దాలతో కాలం గడుపుతున్నాడని BRS మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మళ్లీ అవే అబద్దాలు ఢిల్లీలో చెబుతున్నాడని ఫైర్ అయ్యారు. ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టుగానే ఢిల్లీ ప్రజలను కూడా మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. సోనియా గాంధీని ముందు బలిదేవత అన్నాడని.. మళ్లీ ఆమెనే పొగిడాడని చెప్పారు. KTRపై కేసు ఒక అక్రమ కేసు అని, నయా పైసా అవినీతి జరగలేదన్నారు.