ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంగళవారం భేటీ అయ్యారు. ఇటీవల ఖర్గే అనారోగ్యానికి గురికావడంతో, ఆయనను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది.