తెలంగాణలోని గ్రామస్థాయి ఉద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతోపాటు గ్రామస్థాయి ఉద్యోగుల జీతాలు కూడా ఏకకాలంలో చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధిహామీ పథకం పెండింగ్ బకాయిలన్నీ 2-3 రోజుల్లోగా విడుదల చేయాలన్నారు. ఒక్కరూపాయి కూడా పెండింగ్ లో ఉండకుండా పూర్తిగా చెల్లించాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై గురువారం సమీక్షించిన సీఎం..ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.