బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. పవర్ ప్లేలో దక్కిన శుభారంభాన్ని కొనసాగించలేకపోయామని తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మిచెల్ సాంట్నర్.. టీమిండియా స్పిన్నర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.