దుబాయ్ వేదికగా భారత్-కివీస్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఉత్కంఠభరితంగా సాగిన విషయం తెలిసిందే. మరో ఓవర్ మిగిలి ఉండగానే 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. ఇక కివీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో క్రికెట్ ప్రియులు చూశారు. ఫైనల్ మ్యాచ్‌ను 90 కోట్లకు పైగా ఫ్యాన్స్ చూశారు. ఇక పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను 60 కోట్ల మంది చూశారు. దీంతో వ్యూస్ పరంగా ఇండోపాక్ మ్యాచ్‌ను ఫైనల్ మ్యాచ్ అధిగమించింది.