టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించి అదరగొట్టాడు. ఝార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ ఈ ఘనత అందుకున్నాడు. హ్యాట్రిక్‌తో పాటు అద్భుతమైన స్పెల్ (4-1-6-3) వేయడం విశేషం. భువీ ధాటికి ఓడిపోయే మ్యాచ్‌లో తన జట్టు యూపీ 10 పరుగుల తేడాతో గెలిచింది. 17వ ఓవర్ వేసిన భువీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. తొలి మూడు బంతుల్లోనే రాబిన్ మింజ్, బాల్ కృష్ణ, వివేకానంద్ తివారీలను అవుట్ చేశాడు.