ప్రియాంక వారణాసిలో పోటీ చేస్తే మోదీ ఓడిపోయేవారు: రాహుల్

61చూసినవారు
ప్రియాంక వారణాసిలో పోటీ చేస్తే మోదీ ఓడిపోయేవారు: రాహుల్
రాయ్‌బరేలీ, అమేథీలలో తమ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేసిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తెలిపారు. మంగళవారం రాయ్‌బరేలీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని, ప్రియాంక గాంధీ అయోధ్యలో కాకుండా వారణాసిలో పోటీ చేసి ఉంటే ప్రధాని మోదీ ఓడిపోయి ఉండేవారని అన్నారు.

సంబంధిత పోస్ట్