స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని పార్టీ నేతలకు, శ్రేణులకు సీఎం రేవంత్ ముఖ్య సూచనలు చేశారు. ఈ నెల 26న రైతు భరోసా మొదలు పెట్టబోతున్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. త్వరలోనే రైతు కూలీలకు రూ.12 వేలు అందించనున్నామన్నారు. రూ.21 వేల కోట్ల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్, ఉచిత కరెంట్, రాయితీ గ్యాస్ సిలిండర్ల గురించి పంచాయితీల్లో, మున్సిపాలిటీల్లో ప్రచారం చేయాలన్నారు.