AP: రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థల్లోని పొరుగు సేవలు, ఆప్కాస్ ఉద్యోగులు, సిబ్బంది, NRMలకు కూటమి సర్కారు షాకిచ్చింది. వారి ఉద్యోగ విరమణ వయసు 62ఏళ్లకు పెంపు వర్తించదని పురపాలక శాఖ స్పష్టం చేసింది. దీంతో, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో తమకూ పెంపును వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. G.O నంబరు15 పుర, నగరపాలక సంస్థల్లోని పొరుగు సేవల ఉద్యోగులకు వర్తించదని వారు కోరుతున్నారు.