స్టార్టప్ ఫండింగ్‌లో భారతదేశపు టెక్ హబ్, స్టార్టప్ల పవర్ హౌస్ అయిన బెంగళూరును దాటేసి ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. స్టార్టప్ డేటాబేస్ సంస్థ ట్రాక్స్న్ ఓ నివేదికను ప్రకటించింది. దీని ప్రకారం భారతదేశానికి వచ్చిన మొత్తం నిధులలో ఢిల్లీ 40% నిధులను ఆకర్షించింది. ఎరిషా ఇ మొబిలిటీ, డార్విన్ బాక్స్, ఇన్ ఫ్రా మార్కెట్ అనే 3 స్టార్టప్‌లు ఒక్కొక్కటి $100 మిలియన్లకు పైగా వసూలు చేశాయని వెల్లడించింది.