జార్ఖండ్‌లో కూలిన వంతెన..! (వీడియో)

52చూసినవారు
జార్ఖండ్‌లోని గిరిదిహ్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన తాజాగా కుప్పకూలింది. డియోరీ సబ్‌డివిజన్‌లోని ఫతేపూర్-భెల్వాఘటి గ్రామాల రాకపోకలకు వీలుగా రూ.5 కోట్లకుపైగా వ్యయంతో అర్గా నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో శనివారం రాత్రి వంతెన కూలిపోయింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్