కుప్పకూలిన బ్రిడ్జి.. వాహనాలు నదిలో పడి 13 మంది గల్లంతు (వీడియో)

63చూసినవారు
వియత్నాంలోని ఫు థో ప్రావిన్స్‌లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఫోంగ్ చౌ వంతెన అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. నదిలో పడిన ముగ్గురిని స్థానికులు కాపాడారు. 13 మంది గల్లంతు అయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు నదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. వంతెన కూలిపోతున్న తరుణంలో ఓ కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్