పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ వాడీవేడీగా జరగనున్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా ప్రత్యక్ష పన్నుల (ఆదాయపు పన్ను) శ్లాబ్ సడలించి మధ్యతరగతి వేతన జీవులకు ఊరట కల్గిస్తారా? అని దేశంలోని ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఈ సవాళ్ల మధ్య కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించడం కత్తిమీద సాములా మారింది.