విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. గత వారం వీహెచ్‌పీ లీగల్ సెల్ నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. మెజారిటీల(హిందువుల) అభీష్టం మేరకు భారతదేశం పనిచేస్తుందని అన్నారు. దీంతో ఆయనపై ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షాలు, పలు సంఘాలు సుప్రీంకోర్టుకు లేఖలు రాస్తున్నాయి.