భార్య వేధింపులు భరించలేక సాఫ్ట్వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. వరకట్న వేధింపులు, గృహ హింస, బలవంతపు సెక్స్ కేసులు పెట్టి భార్య వేధించిందని 24 పేజీల లేఖను పోలీసులు, NGOలు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు పంపాడు. చట్టం ఆమెకే అనుకూలంగా ఉందని వాపోయాడు. ఇంటి అద్దె సహా చెల్లింపులన్నీ పూర్తి చేసి ఉరేసుకున్నాడు. తాను పడిన వేదనను అతడు వివరిస్తున్న వీడియో కన్నీళ్లు తెప్పిస్తోంది.