ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కొరియర్ కంటైనర్‌ను పికప్ వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో మొత్తం 7 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 3 మహిళలు, 3 పురుషులు, చిన్నారి ఉన్నారు. మరో 13 మందికి తీవ్రగాయాలు కాగా.. హాస్పిటల్‌కు తరలించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.