మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తలను మోహన్ బాబు పీఆర్ టీమ్ ఖండించింది. మనోజ్ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆస్తి వ్యవహారంలో మోహన్ బాబు, మనోజ్ గొడవపడ్డారని, పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.