TG: వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి వద్ద 70 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ దాడిలో బియ్యంతోపాటు రెండు వాహనాలను సీజ్ చేశారు. ఈమేరకు సంకెపల్లి వద్ద రెండు వాహనాలను పట్టుకుని, బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం 240 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు తెలిపారు. ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.