నల్గొండ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వృద్ధుడైన మామపై ఓ కోడలు విచక్షణారహితంగా దాడి చేసింది. వీల్ చైర్‌లో ఉన్న మామ మొఖంపై పదే పదే చెప్పుతో దాడికి పాల్పడింది. ఈ క్రమంలో మామ కోడలి కాళ్లు పట్టుకొని వేడుకున్నా ఆమె కనికరించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.