కెనడాలోని ఎడ్మోంటన్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న పంజాబీ సెక్యూరిటీ గార్డు హర్షన్‌దీప్ సింగ్ అనే 20 ఏళ్ల యువకుడిని కాల్చి చంపేశాడు. ఓ చిన్న వివాదం కారణంగా విద్యార్థిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.