TG: నటుడు మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు కలకలం రేపాయి. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ గాయాలతో హైదరాబాద్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే తనపై కూడా మనోజ్ దాడి చేసినట్లు మోహన్ బాబు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్, ఆస్తుల వ్యవహారంపై కుటుంబంలో తగాదాలు వచ్చినట్లు తెలుస్తోంది.