అమెరికాలో ఇటీవల 102 ఏళ్ళ వృద్ధురాలితో 100 ఏళ్ళ వృద్ధుడికి జరిగిన లవ్ మ్యారేజీ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఇద్దరి వయస్సు కలిపితే 202 ఏండ్ల 271 రోజులని లండన్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వెల్లడించింది. పదేండ్లుగా లవ్ చేసుకుని తాజాగా ఈ ఏడాది మే 3న పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఓల్డెస్ట్ కొత్త జంట గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు.