యాదగిరిగుట్టలో భక్తుల కోలాహలం

84చూసినవారు
యాదగిరిగుట్టలో భక్తుల కోలాహలం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్