కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని BJP నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ చర్యలను ఎవరూ సమర్థించరని చెప్పారు. నిరాశ, నిస్పృహలతో రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ నాయకుడిగా ఉన్నంత వరకు ఎవరూ ఆ పార్టీని రక్షించలేరని విమర్శించారు. మిడిమిడి జ్ఞానంతో రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని.. రాహుల్ కి దేశంపై, దేశ చరిత్రపై అవగాహన లేదన్నారు.