యూపీలోని కుషినగర్‌లో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రిన్సిపాల్ పరీక్షల్లో మంచి మార్కులు వేస్తానని చెప్పి 12వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఆమెపై కాలేజీలో అత్యాచారం చేశాడు. ఈ ఘటనను ఓ విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీసులు నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.