తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం నేడు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు పథకాలతో పాటు భూభారతి, SC వర్గీకరణ, BCలకు 42శాతం రిజర్వేషన్లు వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. వీటికి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.