తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ పార్టీపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ఐదేళ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. అలాగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల లాగే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఉనికి లేదని, ఆ ఉనికి కోసమే కేసీఆర్ ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన BRS.. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందనడం సరికాదన్నారు.