ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు, కపట చేష్టలకు ఖచ్చితమైన కేస్ స్టడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్‌తో జతకట్టినప్పుడు కేజ్రీవాల్ తెలివైన, స్వచ్ఛమైన నాయకుడని కాంగ్రెస్ ప్రశంసించిందని గుర్తు చేశారు. కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా నిలబడాలని నిర్ణయించుకుంటే ఇప్పుడు తప్పుగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.