కూల్‌డ్రింక్స్ బాటిళ్లలో కూల్ డ్రింక్‌ను పూర్తిగా నింపకుండా పైన కొద్దిగా ఖాళీగా ఉంచుతారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..? ఇలా చేయడానికి కారణమేంటంటే.. సాఫ్ట్ డ్రింక్స్ బాటిళ్లను చల్లని ఉష్ణోగ్రతల వద్ద ప్యాకేజింగ్ చేస్తారు. ఆ తర్వాత వాటిని సూర్యరశ్మి లో ఉంచుతారు. దీని వల్ల బాటిళ్లలో ఉష్ణోగ్రత పెరిగి గ్యాస్ బయటకి వస్తుంది. ఈ క్రమంలో ఒత్తిడి పెరిగి ప్లాస్టిక్ బాటిళ్లు పగలిపోయే అవకాశం ఉంటుంది.