ప్రపంచంలోని మిగతా దేశాలతో పోల్చితే చేపలను ఆహారంలో తీసుకునే వారి సంఖ్య భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఓ సర్వే తెలిపింది. చేపలను ఆహారంలో తీసుకునే దేశాల్లో తలసరి వినియోగంలో 2023 సంవత్సరం ప్రకారం ఐస్‌లాండ్ 87.71, చైనా 39.89, దక్షిణాఫ్రికా 6.45 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. అదే సమయంలో భారత్‌లో 7.96గా ఉన్నట్లు పేర్కొన్నది.