TG: కాంగ్రెస్ పార్టీ దృష్టిలో.. పిల్లలకు పురుగుల అన్నం పెట్టడం విజయం.. వారి చావులు ఉత్సవం అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. 'యువతకు ఉద్యోగాలివ్వకపోవడం.. వారికి సంకెళ్లేయడం, రైతులకు ఉరి తాళ్లేయడం, ఆడబిడ్డలను ఆగం చేయడం, ఇళ్లు ఇస్తామని.. ఉన్న ఇళ్లు కూల్చడం, రుణమాఫీ మాట తప్పడం.. అప్పులకు నోటీసులివ్వడం, ఏడాది అరాచక పాలన.. ప్రజల చావులు, గోసలు కాంగ్రెస్ విజయమా? ఉత్సవమా? ఇవి విజయోత్సవాలు కావు.. వికృత ఉత్సవాలు' అని Xలో పోస్ట్ చేశారు.