5 సూత్రాలపై చైనా, అమెరికా మధ్య ఏకాభిప్రాయం

68చూసినవారు
5 సూత్రాలపై చైనా, అమెరికా మధ్య ఏకాభిప్రాయం
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనా మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం కుదిరింది. అమెరికా విదేశాంగ శాఖమంత్రి ఆంటోనీ బ్లింకెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ, ప్రాంతీయ వివాదాలపై సంప్రదింపులు, ప్రత్యేక దూతల మధ్య కమ్యూనికేషన్‌ను బలోపేతంచేయడం, ప్రభుత్వాధినేతల సూచనలకు అనుగుణంగా మైత్రిని వృద్ధి చేసుకోవడం, ఉన్నతాధికారులు పరస్పర పర్యటనలు చేపట్టడం ఇందులో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్