రాజధాని అమరావతిలో రూ.40వేల కోట్లతో నిర్మాణ పనులు: మంత్రి నారాయణ

61చూసినవారు
రాజధాని అమరావతిలో రూ.40వేల కోట్లతో నిర్మాణ పనులు: మంత్రి నారాయణ
ఏపీ రాజధాని నిర్మాణ పనులకు సీఆర్డీఏతో పాటు అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పిలిచిన టెండర్లను తెరిచినట్టు మంత్రి నారాయణ వెల్లడించారు. మార్చి 12 నుంచి రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకూ రూ.40 వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లను తెరిచినట్టు మంత్రి తెలిపారు. రెండు మూడు రోజుల్లో కాంట్రాక్టు సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్‌ కూడా జారీ చేయనున్నట్టు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్