జగిత్యాలలో గత కొన్ని రోజుల నుండి ఫ్లెక్సీల వివాదం మొదలైంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటో ఉన్న ఫ్లెక్సీని చింపినవారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతు కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చింపివేశారని ఆరోపిస్తూ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.