AP: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులను నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూ. కాలేజీల్లో శనివారం నుంచి ప్రారంభం కానుంది. దీని వల్ల 1,48,419 మంది విద్యార్థులకు భోజనం అందనుంది. విజయవాడ పాయకాపురం నుంచి మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలుకు రూ.115 కోట్లు ఖర్చు చేయనున్నారు.