త్వరలో స్థానికంగా ఉన్న ఈ-కామర్స్ గోదాముల్లో సోదాలు నిర్వహిస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. చైనా మాంజాల వల్ల అధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా మాంజాను స్థానికంగా కూడా తయారు చేస్తున్నారని, అందుకే చాలా సులభంగా లభ్యమవుతోందన్నారు. ఈ-కామర్స్ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకుంటే ఇంటికే వస్తోందన్నారు. చైనా మాంజా వినియోగాన్ని అరికట్టడంలో ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు.